శేరిలింగంపల్లి, జూలై 18 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీలో రేణుక ఎల్లమ్మ నల్ల పోచమ్మఅమ్మవారి బోనాల పండుగ సందర్భంగా జిహెచ్ఎంసి సిబ్బంది సహకారంతో నేతాజీ నగర్ కాలనీని అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ పరిశుభ్రం చేయించారు. ఆదివారం నాడు నిర్వహించ తలపెట్టిన బోనాల పండుగ సందర్భంగా జాతర జరిపేందుకు ఆలయ కమిటీ ద్వారా నిశ్చయించడం జరిగిందన్నారు. అందరూ కలిసిమెలిసి ఆనందంగా అమ్మవారి బోనాల పండుగ జాతరను జరుపుకోవాలని అన్నారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులను పొందాలని పిలుపునిచ్చారు.