శేరిలింగంపల్లి, జనవరి 28 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ సర్కిల్ ప్రధాన కార్యాలయంలో రూ. 29.80 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన కార్యాలయం మరమత్తులు, లిఫ్ట్ ను డీసీ మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, GHMC అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్టం లిఫ్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని , ఆఫీస్ పని కోసం వచ్చే మహిళలకు ,సీనియర్ సిటిజన్ వాళ్ళ సౌకర్యార్థం లిఫ్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందని , వారి సౌకర్యార్థం కోసం లిఫ్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, సకల సౌకర్యాలతో అన్ని హంగులతో లిఫ్ట్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు EE KVS రాజు, DE శ్రీ దేవి, DE దుర్గాప్రసాద్, AE ప్రశాంత్, AE ప్రతాప్,AE ప్రశాంత్, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉషారాణి, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్ ,మాజీ కౌన్సిలర్ లక్ష్మీ నారాయణ గౌడ్, రఘునాథ్ రెడ్డి ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ,జనార్దన్ రెడ్డి, అక్బర్ ఖాన్,భవాని, అనిల్, నరేందర్ బల్లా, రాజశేఖర్ రెడ్డి, సందీప్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.