వీధి వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలం ఏర్పాటు చేయాలి: హైడ్రా కమిషనర్ రంగనాథ్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ముజఫర్ అహ్మద్ నగర్‌లో వీధి వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న డబ్బాలను కూల్చివేయడంతో ఉపాధి కోల్పోతున్న వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలం ఏర్పాటు చేయాలని కోరుతూ MCPI(U) మియాపూర్ డివిజన్ సహాయ కార్యదర్శి పల్లె మురళి ఆధ్వర్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు వినతిపత్రం సమర్పించారు. వీధి వ్యాపారుల సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన ప్రతినిధులు.. ఆక్రమణల తొలగింపు చర్యల వల్ల వారి జీవనోపాధికి నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. వీధి వ్యాపారుల జీవనోపాధికి ప్రభుత్వం అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

వినతిపత్రంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సానుకూలంగా స్పందించారు. ఈ అంశంపై CMC కమిషనర్ సృజనతో మాట్లాడి వీధి వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. వీధి వ్యాపారులకు అండగా ఉంటామని, ప్రత్యేకంగా స్ట్రీట్ వెండింగ్ యూనిట్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వీధి వ్యాపారులు అనంతరాం, మౌలానా, విఠల్, శివ, భారతమ్మ, అనసూయ, చిట్టమ్మ, బబిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here