అల్లూరి సీతారామరాజు నగర్ కాలనీ పార్కును సంద‌ర్శించిన‌ కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని  అల్లూరి సీతారామరాజు నగర్ కాలనీలోని పార్కును స్థానిక కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్ కాల‌నీ వాసులతో ఆదివారం ప‌రిశీలించారు. ఈ సంధర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పూర్తి స‌హాయ స‌హ‌కారాల‌తో డివిజన్ లోని ప్రతి కాలనీలో ఉన్నటువంటి పార్కులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రాధాన్య‌త క్ర‌మంలో మిగిలిన స‌మ‌స్య‌ల‌ను సైతం ప‌రిష్క‌రిస్తామ‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, శ్రీనివాసరావు, రవి కిరణ్‌, సాయి, అంజి రెడ్డి, విశ్వనాథ్ రాజు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

కాల‌నీ వాసుల‌తో క‌ల‌సి పార్కును ప‌రిశీలిస్తున్న కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్‌

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here