- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): తెరాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా పూర్తి చేసిన పట్టభద్రుల ఓటర్ నమోదు వివరాలను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి పలువురు తెరాస నాయకులు శుక్రవారం అందజేశారు. హఫీజ్పేట్ డివిజన్ తెరాస నాయకులు వాలా హరీష్, లక్ష్మారెడ్డి, కొండాపూర్ డివిజన్ తెరాస నాయకులు జంగం గౌడ్, బలరాం యాదవ్, హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ జానకి రామరాజులు ఓటరు నమోదు పత్రాలను ఆరెకపూడి గాంధీకి అందజేశారు.
ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు గాను పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. నవంబర్ 6 తో ఓటరు నమోదు గడువు ముగుస్తున్నందున శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారిచే ఓటరు నమోదు చేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రవీందర్, తెరాస నాయకుడు మిరియాల రాఘవరావు పాల్గొన్నారు.