చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ సర్కిల్ పరిధిలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి సర్కిల్ డీసీ సుధాంష్కు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ చందానగర్ జాతీయ రహదారి పక్కన పెట్రోల్ పంప్ వద్ద భారీ అక్రమ నిర్మాణం కొనసాగుతుందన్నారు. 40 ఏళ్లకు ముందు నిర్మించిన సదరు భవనం చుట్టూ పార్కింగ్, సెట్ బ్యాక్స్ లేవని, ఆ భవంతి చిన్న చిన్న నిర్మాణాలపై పడిపోయే అవకాశం ఉందని, కనుక వెంటనే సదరు నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని కోరారు.