పోలీస్ కిష్ట‌య్య‌కు ఘ‌న నివాళి

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ మలి దశ ఉద్యమం తొలి అమరుడు పుట్టకొక్కుల పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ 15వ వర్ధంతి సందర్భంగా గంగారం గ్రామంలో చందానగర్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో కిష్ట‌య్య ముదిరాజ్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో దొంతి శేఖర్ ముదిరాజ్, వంటల యాదగిరి ముదిరాజ్, దొంతి రాజేందర్ ముదిరాజ్, మార్ని రాజుముదిరాజ్, వంటల నరసింహ ముదిరాజ్, దొంతి నరసింహ ముదిరాజ్, దొంతి శ్రీనివాస్ ముదిరాజ్, దొంతి శ్రీధర్ ముదిరాజ్, దొంతి శేఖర్ ముదిరాజ్, దొంతి శ్రావణ్ ముదిరాజ్, దొంతి వంశీ ముదిరాజ్ పాల్గొన్నారు.

పోలీస్ కిష్ట‌య్య చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పిస్తున్న నాయ‌కులు

గ‌న్‌పార్క్ వ‌ద్ద‌..

పోలీస్ కిష్టయ్య 15వ వర్ధంతి సందర్భంగా గ‌న్‌పార్క్ హైదరాబాద్ తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పోలీస్ కిష్టయ్యని స్మరిస్తూ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ పోలీస్ కిష్టయ్య చేసిన త్యాగం మార్చిపోలేనటువంటిది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కు మన ముదిరాజ్ బిడ్డ తొలి అమరవీరుడుగా ప్రాణ త్యాగం చేయడం తెలంగాణ రాష్ట్ర నాలుగున్న‌ర‌ కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చినందుకు గర్వంగా ఉంద‌న్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here