శేరిలింగంపల్లి, డిసెంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని SMR హై ల్యాండ్స్ అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన అపార్ట్మెంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సన్మానించారు.
ఈ సందర్భంగా PAC ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ SMR హై ల్యాండ్స్ అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా SMR హై ల్యాండ్స్ అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని, ఏ చిన్న సమస్య అయినా తన దృష్టికి గాని తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో SMR హై ల్యాండ్స్ అపార్ట్మెంట్స్ నూతన కార్యవర్గ సభ్యులు ప్రెసిడెంట్ నర్సిరెడ్డి, జనరల్ సెక్రెటరీ లక్ష్మణ్, ట్రెజరర్ పిచ్చయ్య, గౌరవ అధ్యక్షుడు మల్లారెడ్డి, గౌరవ అధ్యక్షుడు సదానంద్, వైస్ ప్రెసిడెంట్ నవీన్, సెక్రెటరీ శోభ, సెక్రెటరీ సుగుణ, బాల్ రాజ్, రాజేష్ పాండ్య, వాణి తదితరులు పాల్గొన్నారు.