కేశవ నగర్ బస్తీలో 95 శాతం అభివృద్ధి పనులు పూర్తి: కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 14 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని కేశవ నగర్ బస్తీలో కేశవనగర్ డెవలప్మెంట్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీజిఆర్ యూత్ అసోసియేషన్ లోగోను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ తో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంగాధ‌ర్ రెడ్డి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలలో కేశవనగర్ బస్తీలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ పైప్‌లైన్‌లు, తాగునీటి సదుపాయాలు, వీధి దీపాలు వంటి మౌలిక వసతులను విస్తృతంగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. తాను కార్పొరేటర్‌ గా బాధ్యతలు స్వీకరించే ముందు ఈ ప్రాంతంలో సరైన రహదారులు, మురుగు కాలువలు, మంచినీటి వసతులు లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. నిరంతర కృషితో ప్ర‌స్తుతం దాదాపు 95 శాతం అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా త్వరలోనే 100 శాతం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ మాజీ ఉపాధ్యక్షుడు తిరుపతి, సీనియర్ నాయకులు శ్రీరాములు, ఈశ్వర్, బిక్షపతి, హనుమంతు, రాజేందర్, కిషన్ గోలి, రాజు, శ్రీను, యాదయ్య, గోవింద్, శ్రీశైలం, రామకృష్ణ , కేశవ నగర్ అధ్యక్షుడు లక్ష్మణ్ , ఉపాధ్యక్షులు నరసింహ, యాదయ్య, ప్రధాన కార్యదర్శులు శివ, నాగరాజు, కుమార్, జాయింట్ సెక్రెటరీ గణేష్, వీరేశ్, వెంకటేష్, వంశీధర్, ట్రెజరర్ కర్ణ, హరి బాబు, దేవరాజ్, హనుమంతు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ నవీన్, నరసింహ, పవన్, కురుమంతు, నవీన్, శివ, కార్తీక్, తరుణ్, కిట్టు, నరేష్, సురేష్, నరసింహ, కేశవ నగర్ బస్తీ వాసులు, యువత, స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here