రాగం సుజాత యాదవ్ కన్నుమూత

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాలకు సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్ పర్సన్ గా గతంలో బాధ్యతలు నిర్వహించిన రాగం సుజాత నాగేందర్ యాదవ్ స్వర్గస్తులయ్యారు. శేరిలింగంపల్లి నల్లగండ్ల గ్రామానికి చెందిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సతీమణి ఐన సుజాత యాదవ్ శ్వాస సంబంధిత సమస్యతో గత కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో ఆమె కన్నుమూశారు.

రాగం సుజాత యాదవ్ మృతి పట్ల శేరిలింగంపల్లికి చెందిన వివిధ పార్టీల నాయకులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆమెతో వారికున్న జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాను భూతి పనిచేశారు. శుక్రవారం ఉదయం వారి స్వగృహంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here