కరోనా కష్టకాలంలో అహర్నిశలు శ్రమిస్తున్న విద్యుత్ కార్మికులకు ప్రభుత్వం అండగా నిలవాలి: 327 రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు

నమస్తే శేరిలింగంపల్లి: సైబర్ సిటీ సర్కిల్ కూకట్ పల్లి, కొండాపూర్ డివిజన్ కార్యాలయాలలో 327 యూనియన్ ఆధ్వర్యంలో మే డే వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.వెంకటేశ్వర్లు జెండాను ఆవిష్కరించి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా అలాంటి విపత్కర పరిస్థితుల్లో అహర్నిశలు కృషి చేస్తున్న విద్యుత్ కార్మికులకు ప్రజలంతా సదా రుణపడి ఉంటారని అన్నారు. వెలకట్టలేని సేవలందిస్తున్న విద్యుత్ కార్మికులకు ప్రభుత్వం తగిన సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి డివిజన్ ప్రెసిడెంట్ ఎస్. రమేష్, ట్రెజరర్ జీవన్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేకే.మహేందర్, గచ్చిబౌలి డివిజన్ ప్రెసిడెంట్ వై. వెంకట్రాంరెడ్డి, గచ్చిబౌలి డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రాజేందర్, కొండాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ ఎస్.రమేష్, సెక్రెటరీ రాజేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

కార్మిక జెండా ఆవిష్కరిస్తున్న 327 రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.వెంకటేశ్వర్లు, యూనియన్ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here