నమస్తే శేరిలింగంపల్లి: కాలనీలలో ప్రజలకు అవసరమయ్యే అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ లో రూ. 50 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న వరద నీటి కాలువ నిర్మాణ పనులను స్థానిక కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రఘునాథ్ రెడ్డి కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. సిబిఅర్ ఎస్టేట్ సమీపంలో జరుగుతున్న వరద నీటి కాలువ నిర్మాణం పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. రాబోయే వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు జీహెచ్ఎంసీ అధికారులు, వర్క్ ఇన్స్పెక్టర్ జగన్ తదితరులు పాల్గొన్నారు.






