నమస్తే శేరిలింగంపల్లి: ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు కొత్తపల్లి హేమచంద్ టీసీఎస్ లో సాప్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నాడు. కొత్తపల్లి హేమచంద్ ఈ నెల 3 వ తేదీన సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అతని ఫోన్ ను ఇంట్లోనే వదిలిపెట్టి ఇంటి తాళం, బైక్ తాళాలు తీసుకెళ్లాడు. అంతకుముందు ఇంట్లో భార్యభర్తలిద్దరు ఆర్థిక విషయాలపై చర్చించారు. హేమచంద్ తన తల్లిదండ్రుల పేరు మీద చెల్లిస్తున్న ఎల్ ఐ సీ పాలసీపై భార్య ప్రశ్నించింది. సాధారణంగానే సమాధానం చెప్పిన భర్త హేమచంద్ ఇంటి నుంచి బయటకి వెళ్లాడు. చందానగర్ ఏటీఎంలో రూ. 11వేల డబ్బులు డ్రా చేసినట్లు ఫోన్ కు మెసేజ్ వచ్చింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతంలో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చందానగర్ పోలీసులు వెల్లడించారు. హేమచంద్ ఎత్తు 5.10 అడుగులు, బ్రౌన్ కలర్, గుండ్రని ముఖం గల గుర్తులతో ఉంటాడన్నారు. ఇంటినుంచి వెళ్లే సమయంలో గ్రే కలర్ షర్ట్, క్రీమ్ కలర్ ప్యాంట్ తో ధరించి ఉన్నట్లు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 9121657231 నంబర్ ను సంప్రదించవచ్చన్నారు.