నమస్తే శేరిలింగంపల్లి: సామాజిక సేవారంగలో పేదలకు తనదైన శైలిలో సేవలు అందజేస్తున్న హోప్ ఫౌండేషన్ ను ఉత్తమ ఎన్జీఓ గా జీహెచ్ఎంసీ గుర్తించడం జరిగిందని చందానగర్ సర్కిల్ 21 సహాయ వైద్యాధికారి కార్తీక్ అన్నారు. చందానగర్ హుడా కాలనీలోని హోప్ ఫౌండేషన్ కార్యాలయంలో చైర్మన్ కొండా విజయ్ కుమార్ కు జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ సహాయ వైద్యాధికారి కార్తీక్ ఉత్తమ ఎన్జీఓ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కార్తీక్ మాట్లాడుతూ సామాజిక సేవ చేయడంలో హోప్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. పేదలకు పలు రకాల సేవ చేయడంలో హోప్ ఫౌండేషన్ ముందు వరుసలో ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ్ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం వివిధ రంగాలలో ఉత్తమ సేవలు అందిస్తున్న పలు సంస్థలను గుర్తిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా హోప్ పౌండేషన్ ను ఉత్తమ ఎన్జీఓగా గుర్తించి ప్రశంసా పత్రాన్ని అందజేసినట్లు చెప్పారు. హోప్ పౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ మాట్లాడుతూ హోప్ ఫౌండేషన్ సేవలను గుర్తించి జీహెచ్ఎంసీ ఉత్తమ ఎన్జీఓ ప్రశంసాపత్రాన్ని అందజేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు శాంతిభూషణ్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి తో పాటు చందానగర్ సర్కిల్ 21 సిబ్బంది గంగిరెడ్డి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
