నమస్తే శేరిలింగంపల్లి: ప్రతి సంవత్సరం ముస్లిం మాసాల ప్రకారం రబ్బీసాని మాసంలో దర్గా వద్ద హిందూ ముస్లింలు ఐకమత్యంతో ఘనంగా గ్యార్మీ పండుగ జరుపుకోవడం జరుగుతుందని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి. జగదీశ్వర గౌడ్ అన్నారు. గ్యార్మి పండుగ పురస్కరించుకుని మాదాపూర్ డివిజన్ పరిధిలోని మంజీర రోడ్డు, గోకుల్ ప్లాట్స్ అజామి నవాజ్ షరీఫ్ దస్తగిరి దర్గాలో నిర్వహించిన గ్యార్మీ ఉత్సవాల్లో కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఒకరి ఇంటి వద్ద నుండి సందల్ ఊరేగింపుతో దర్గా వద్దకు చేరుకుని ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుండి జెండా దర్గా వద్దకు తీసుకువచ్చి దర్గా వద్ద నిలపడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ముదిరాజ్, షేక్ సాబేర్, సయ్యద్ ఇమ్రాన్, షేక్ షకిర్, షేక్ పాష, సురేష్ కుమార్, శివ తదితరులు పాల్గొన్నారు.
