నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీ అభివృద్ధికి కృషి చేస్తామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. శనివారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ లో స్థానిక బస్తీ అసోసియేషన్ సభ్యులు, నాయకులతో కలిసి బస్తీలో పాదయాత్ర నిర్వహించారు. కాలనీలో నూతనంగా చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు. స్థానికంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై బస్తీ నాయకులను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య నగర్ టీఆర్ఎస్ బస్తీ కమిటీ అధ్యక్షుడు మునాఫ్ ఖాన్, కృష్ణ కాలనీ టీఆర్ఎస్ అధ్యక్షుడు కృష్ణ యాదవ్, మాదాపూర్ డివిజన్ మైనారిటీ కమిటీ అధ్యక్షులు రహీం, మైనారిటీ నాయకులు లియాకత్, కాసిం, సలీం, మియన్, షోయబ్, యూత్ అధ్యక్షులు ఖాజా, యూత్ సభ్యులు ఇమ్రాన్, మొహమ్మద్, చాంద్, నవాబ్, వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేష్, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.