నమస్తే శేరిలింగంపల్లి: బీఎంఎస్ ద్వారానే అన్ని రంగాల కార్మికులకు సరైన భద్రత లభిస్తుందని, యాజమాన్య వేధింపుల నుంచి కార్మికులకు రక్షణ సాధ్యమని బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. బీఎంఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కొండాపూర్ లోని జీ4ఎస్ సెక్యూరిటీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బిఎంఎస్ జీ4ఎస్ నగర అధ్యక్షుడు సంజీవరెడ్డితో కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కనీస వేతన చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంజీవరెడ్డి మాట్లాడుతూ జీ4ఎస్ ఉద్యోగులపై వివక్ష మానుకోవాలని లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరి త్రినాథ్ గౌడ్, జీ4ఎస్ సెక్యూరిటీ నాయకులు జె. ఎస్. బారిక్, బాబు, సెక్యూరిటీ సంస్థ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.