శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 1 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ RTA కార్యాలయంలో రోడ్డు భద్రత అవగాహన ర్యాలీని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని భిక్షపతి నగర్ కాలనీలో కొండాపూర్ RTA కార్యాలయంలో జరిగిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం 2025 ముగింపు వేడుకల కార్యక్రమంలో భాగంగా జరిగిన అవగహన ర్యాలీలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సదానందం, కొండాపూర్ RTA మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్, నవీన్, కృష్ణవేణి, డ్రైవింగ్ స్కూల్స్ అసోసియేషన్ సభ్యులు, వాహన దారులు, నాయకులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. రహదారి భద్రతా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. ఇలాంటి అవగాహన ర్యాలీల వలన ప్రజలలో చైతన్యం వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో RTA మోటార్ వెహికిల్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్లు మనోజ్ కుమార్, శ్రీ ముఖి, స్వాతి, ఉపాసిని, నాయకులు ఉట్ల కృష్ణ, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, అక్తర్, చాంద్ పాషా, ఉట్ల దశరథ్, తిరుపతి, గుమ్మడి శ్రీనివాస్, రాంచందర్, పితాని శ్రీనివాస్, రాజు, ఉమ , జహీర్ ఖాన్, మహేష్, నూర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.