సమర యోదుల పోరాట బలం.. అమరవీరుల త్యాగ ఫలం.. స్వాతంత్ర దినోత్సవం

  • కేనరి ద స్కూల్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
  • అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు

నమస్తే శేరిలింగంపల్లి: మదీనాగూడలోని కేనరి ద స్కూల్ లో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మొదటగా పాఠశాల చైర్మన్ శ్వేత రెడ్డి చప్పిడి జాతీయ పతాకాన్ని ఎగురవేసి, విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యతను, స్వాతంత్య్రం మన హక్కు అని, మన బాధ్యతలను మనం నిర్వహించినప్పుడే దేశము పరిపూర్ణ స్వాతంత్ర దేశంగా పరిగణించబడుతుందని తెలిపారు.

అనంతరం విద్యార్థులచే నిర్వహించిన గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు లిడియా క్రిస్టినా మాట్లాడాడు. దేశము గొప్పదనం, పౌరులుగా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని విద్యార్ధులను ఉద్దేశించి తమ విలువైన సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలురకాల సాంస్కృతిక కార్యక్రమాలు, పెరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలలో పాఠశాల కో ఆర్డినేటర్ లు, అడ్మిన్ మేనేజర్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here