కరోనా వ్యాధిగ్రస్తులకు, వృద్దులకు పోస్టల్ బ్యాలెట్

పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు విధానం ఇదే..

నమస్తే శేరిలింగంపల్లి: కరోనా వ్యాధి తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో వ్యాధిగ్రస్తులు ఓటు హక్కు వినియోగించుకునేందు పోస్టల్ బ్యాలట్ సదుపాయాన్ని కల్పించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరితో పాటు అంగవైకల్యం ఉన్నవారు, 80 ఏళ్ళు దాటినా వృద్దులు సైతం ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఎనభయ్యేళ్ళు దాటిన వృద్దులు, వికలాంగులు పోలింగ్ బూత్ లకు నేరుగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని, అందుకు అనుగుణంగా అధికారులు బూత్ ల వద్ద ర్యాంపు, వీల్ ఛైర్లు అందుబాట్లు ఉంచాలని తెలిపారు. పోస్టల్ బ్యాలట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకునే వృద్దులు స్వీయ ద్రువీకరణతో కూడిన ఆధార్ ప్రతి,  ఓటరు గుర్తింపు కార్డు,  పదవ తరగతి సర్టిఫికెట్, పాస్ పోర్టులలో ఏదేని ఒక గుర్తిపు పత్రం తో పాటు పూర్తి చిరునామాతో కూడిన దరఖాస్తు ఫారం ను సంబంధిత డివిజన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేయాలని సూచించారు. కరోనా వ్యాధిగ్రస్తులు పరీక్ష కోవిడ్ నిర్ధారణ పరీక్ష సర్టిఫికెట్ ను దరఖాస్తు తో పాటు జత చేయాలని సూచించారు. వ్యాధి గ్రస్తులు నేరుగా వినియోగించుకోదలిస్తే ఫేస్ షీల్డ్, మాస్క్ , చేతి తొడుగులు ధరించి పోలింగ్ చివరి గంట సమయంలో (సా 5 గం.ల నుండి 6 గం.ల వరకు) తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది.

పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని ఇలా ఉపయోగించుకోండి

https://tsec.gov.in/homepage.do

ఆన్లైన్ లో దరఖాస్తు విధానం…
పోస్టల్ బ్యాలెట్ కోసం ఆన్లైన్ లో దరకాస్తు చేసుకునేందుకు https://tsec.gov.in/homepage.do పోర్టల్ లో వెళ్లి ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ పోస్టల్ బ్యాలట్ పై క్లిక్ చేయాలి, మీ మొబైల్ నెంబరు సహాయంతో రిజిస్టర్ చేసుకున్న తర్వాత సర్వీసెస్ లో apply for postal ballot లో వెళ్లి ప్రభుత్వ ఉద్యోగులు, వృద్దులు, కోవిద్ వ్యాధి గ్రస్తులు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 80 ఏళ్ళు దాటిన వృద్దులైతే వయసు ధ్రువీకరణ పత్రాన్ని, కోవిడ్ వ్యాధి గ్రస్తులు మెడికల్ రిపోర్ట్ తో పాటు, వయసు, చిరునామా ధ్రువీకరణ పత్రాలను జత చేయాలి. దరఖాస్తు కోసం ఈ లింక్ లో క్లిక్ చేయండి    tsec.gov.in/homepage.do

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here