- పనులకు శంకుస్థాపన చేసిన టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు బాదావత్ సురేష్ నాయక్
నమస్తే శేరిలింగంపల్లి: గోపన్ పల్లి తండాలో రూ. 1కోటి 70 లక్షలతో సకల హంగులతో ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నిర్మాణ పనులకు సోమవారం టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు బాదావత్ సురేష్ నాయక్ పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోపన్ పల్లి తండా అభివృద్ధిలో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాత్ర ఎన్నటికి మరిచిపోలేనిదని అన్నరు. గతంలో హారితహారం కార్యక్రమంతో పచ్చదనాన్ని పెంపొందించారని, అదేవిధంగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయించారని అన్నారు. తాజాగా ఫంక్షన్ హాల్ నిర్మాణంతో తండా వాసులకు ఎంతో ఉపశమనం కలుగనుందని అన్నారు. తమకు అన్నివేళలా అండగా ఉంటున్న గాంధీకి సదా రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో బంజారా యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.