నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజక వర్గంలో ని డివిజన్లలో వినాయక చవితి ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా గచ్చిబౌలి డివిజన్ లోని మండపాలలోని గణనాథులకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జెరిపెటి జైపాల్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. ఈ కార్యక్రమంలో భరత్ గౌడ్, రాజేందర్, ఉమాకాంత్ , మహమ్మద్ జాంగిర్, సూర్య రాథోడ్ ముఖ్య కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.