నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి, అర్వ బస్తీలలో కార్పొరేటర్ గంగాధరరెడ్డి ప్రజా సమస్యలపై మంగళవారం బస్తీబాట నిర్వహించారు. ఈ సందర్భంగా బస్తీల్లో పర్యటించి సమస్యల గురించి ప్రజలను ఆరా తీశారు. అనంతరం గంగాధరరెడ్డి మాట్లాడుతూ స్థానికంగా త్రాగునీరు, సిసిరోడ్లు, మురికి కాలువల అభివృద్ధి పనులు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు విధిగా ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, వర్క్ ఇన్స్పెక్టర్ విశ్వనాధ్, జి.హెచ్.ఎం.సి సూపర్ వైజర్ రఘు, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






