ఎందరో మహానుభావుల త్యాగఫలమే.. ఈ స్వేచ్ఛా స్వాతంత్య్రం

  • ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలి
  • పలుచోట్ల జాతీయ జెండా ఎగురవేసిన గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి గ్రామంలోని కమ్యూనిటీ హాల్, మండల ప్రాథమిక పాఠశాలలో, గోపనపల్లి తండా ఆటో స్టాండ్, ఎన్టీఆర్ నగర్, గౌలిదొడ్డి వార్డ్ కార్యాలయం, శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.

త్రివర్ణ పతాకం ఎగురవేసి జెండాకు వందనం సమర్పిస్తున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ, భరతమాత చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కోరుకుంటూ ప్రజలందరికీ 78వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ప్రతిఫలమని కొనియాడారు. అందుకే వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ లోనీ రాష్ట్ర, జిల్లా, సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, కాలనీ వాసులు, విద్యార్థిని, విద్యార్థులు, స్థానిక నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here