నమస్తే శే రిలింగంపల్లి: జనసేన పార్టీ ఆద్వర్యంలో ఉచిత కంటి వైద్య శిభిరం నిర్వహించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ కో ఆర్డినేటర్ మాధవరెడ్డి సారథ్యంలో పాపిరెడ్డి కాలని, సురభి కాలనిలలో ఈ శిబిరాన్ని నిర్వహించారు. ఆర్ ఎం టౌన్షిప్ వాసులు విశేషంగా పాల్గొన్నారు. సుమారు 500 వందల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 359 మందికి కళ్ళ జోళ్ళు పంపిణీ చేశారు.
ప్రభుత్వం ప్రచార కార్యక్రమాలకు విరివిరిగా చేసే ఖర్చుతో నాణ్యమైన కళ్ళ అద్దాలు ప్రజలకు అందిస్తే బాగుంటుందని తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యక్తలు అరుణ్ కుమార్, సరోజ ప్రదీప్, కళ్యాణ్ చక్రవర్తి, రమేష్, జిఎస్ కె శ్రావణ్, జయానంద్, సాహో ప్రవీణ్, ప్రశాంత్, అశోక్ కుమార్, సందీప్, లక్ష్మీనారాయణ, హర్ష, దుర్గాప్రసాద్, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.