గౌడ జాతి ఐక్యత కోసం యువత కృషి చేయాలి: పల్లె రవికుమార్ గౌడ్

  • ఘనంగా శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం కార్యలయ ప్రారంభోత్సవం

నమస్తే శేరిలింగంపల్లి: గౌడ జాతి ఐక్యత కోసం యువత ముందుకు రావాలని తెలంగాణ రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. మియాపూర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం కార్యాలయాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర తొలి గీతా పారిశ్రామిక సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేసి వారిని ఘనంగా సత్కరించారు.

కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న పల్లె రవికుమార్ గౌడ్, పల్లె లక్ష్మన్ గౌడ్ తదితరులు

ఈ సందర్భంగా పల్లె రవికుమార్ గౌడ్ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నివాసముంటున్న గౌడ కులస్తులంతా ఏకతాటి పైకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి శేరిలింగంపల్లిలో నివసిస్తున్న గౌడ కులస్తుల జాబితా సిద్ధం చేయాలనుకుంటున్న శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం లక్ష్యాన్ని వారు అభినందించారు.

పల్లె రవికుమార్ గౌడ్ ను సన్మానిస్తున్న శేరిలింగంపల్లి గౌడ ప్రముఖులు

ఆ ప్రక్రియ కోసం ముందుకు వచ్చిన యువ బృందాని పెద్దలు అన్ని రకాలుగా సహకరించాలని సూచించారు. తాటి చెట్టు పైనుంచి కింద పడి గీతా కార్మికులు మృతిచెందడం బాధాకరమని, గీతన్నల రక్షణ కోసం తమ కార్పొరేషన్ కృషి చేసితుందని అన్నారు. అనంతరం తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, గౌడ హాస్టల్ చైర్మన్ పల్లె లక్ష్మణరావు గౌడ్, స్థానిక కార్పొరేటర్లు వి.జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్ లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని వివిధ ప్రాంతాలకు చెందిన గౌడ ప్రముఖులు, నాయకులు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శేరిలింగంపల్లి గౌడ ప్రముఖులతో పల్లె రవికుమార్ గౌడ్, పల్లె లక్ష్మణరావు గౌడ్
గౌడ బంధువులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న పల్లె రవికుమార్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here