ఉచిత మెగా వైద్య శిబిరానికి స్పందన

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధి డోయెన్స్ టౌన్ షిప్ వద్ద అపోలో హాస్పిటల్స్ సౌజన్యంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఉదయం 9 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించిన ఈ శిబిరంలో ఎత్తు, బరువు, రక్తపోటు, షుగర్, పల్స్, కంటి, దంత పరీక్షలతోపాటు ఈ.సీ.జీ. మొదలగు పరీక్షలు నిర్వహించారు.

వైద్యులు పృథ్వీ గణేష్ ( జనరల్ ఫిజిషన్ ), సాయి విశ్వనాథ్( ఆప్తమాలజిస్ట్, ఎలైట్ హాస్పిటల్), డాక్టర్ యూసూఫ్ ( డెంటల్ ) వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంద’ని తెలిపారు. ‘ప్రతిఒక్కరు నిత్య వ్యాయామం, మెడిటేషన్, యోగ, ధ్యానము, నడక, కనీసం 40 నిమిషాలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు లింగారెడ్డి, ఐ ఎస్ రామిరెడ్డి, అనంత కుమార్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విష్ణు ప్రసాద్, శివరామకృష్ణ, కొండా శ్రీనివాసరావు , హాస్పిటల్ ప్రతినిధి అజిత్ త్రిపాఠి పాల్గొన్నారు. ఈ శిబిరంలో 90 మందికి వైద్యసేవలు అందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here