
చందానగర్(సమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ పరిధిలోని జవహర్నగర్(సౌత్)లో రూ. 20లక్షలతో చేపట్టిన ఎస్డబ్ల్యుడి డ్రైన్ పనులను స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓపెన్ డ్రైనేజీ వలన ఇబ్బంది పడుతున్నామని, కొత్తగా డ్రైనేజ్ పనులు చేపట్టాలని స్థానికులు కోరడంతో ఎస్డబ్ల్యుడి డ్రైన్ పనులను చేపట్టడం జరిగిందన్నారు. పనులను త్వరగా పూర్తి చేసి కాలనీ వాసులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు కృష్ణ రావు, రమేష్, షబ్బీర్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.





