డ్రైనేజీ పైప్ లైన్ పనులు ప్రారంభం

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గచ్చిబౌలి విలేజ్ స్ట్రీట్ నెం. 2 లో నూతనంగా ఏర్పాటు చేయనున్న డ్రైనేజీ పైప్ లైన్ పనులను జిహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, సంబంధిత జిహెచ్ఎంసి అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నూతన పైప్ లైన్ల ఏర్పాటుతో కొన్నెండ్లుగా అనేక సంవత్సరాలుగా గచ్చిబౌలి విలేజ్ బస్తీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలు దూరం కాబోతున్నాయన్నారు.

పైప్ లైన్ ల నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ సందీప్, డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, గచ్చిబౌలి విలేజ్ ప్రెసిడెంట్ సయ్యద్ నయీమ్, గడ్డ మహేష్, లాల్మన్ జైసింగ్, గడ్డ సధానంద్, యూసుఫ్, రాజు నాయక్, గోపాల్ యాదవ్, విజయ్ సింగ్, మహమూద్, గడ్డ రాజు, సయ్యద్ అజ్జు, గడ్డ సత్యనారాయణ, జై రామ్, సత్తర్, ఫరీద్, గడ్డ ప్రకాష్, లడ్డు పాషా, గడ్డ ఈశ్వర్, వెంకటేష్, ఖాసీమ్, ఖాదర్, జబ్బర్, గణేష్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here