వైద్యుల నిర్లక్ష్యానికి పసి కందు మృతి

నమస్తే శేరిలింగంపల్లి: వైద్యుల నిర్లక్ష్యానికి ఓ పసి కందు మరణించింది. వివరాలు.. కొండాపూర్ లో నివాసము ఉండే NSSMP చౌదరి తన భార్య దివ్యకు పురిటి నొప్పులు అధికమవడంతో 26న రాత్రి 9 గంటలకు సమీపంలోని IVY లీఫ్ హాస్పిటల్ కు తీసుకెళ్ళాడు. సంభందిత వైద్యుడు లేక పోవడముతో డ్యూటీలో ఉన్న డాక్టర్ తో ఫోన్ చేయించి విషయము చెప్పాడు. ఆ డాక్టర్ సూచనల మేరకు దవాఖాన సిబ్బంది 6 నెలల గర్భవతి కి సెలైన్ తో పాటు ఇంజెక్షన్ ఇవ్వగా, కొద్ది సేపటికి మహిళకు రక్తశ్రావమంది. మగ శిశువు బయటకు వచ్చి కొద్ది సేపటికి మరణించాడు. IVY లీఫ్ హాస్పిటల్ డాక్టర్, సిబ్బంది నిర్లక్షము వల్లే తన కొడుకు చనిపోయాడని, ఆ ఆసుపత్రి యజమాన్యం పై NSSMP చౌదరి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here