అక్టోబర్ 15 న బిఎల్ఎఫ్ ఆందోళన

  • అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ కోసం..
  • దళిత బంధు, బిసి, ఎస్టీ, మైనారిటీ కార్పోరేషన్లకు నిధుల కేటాయింపు కోసం.. BLF రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు
  • BLF రాష్ట్ర కమిటి కన్వీనర్ దండి వెంకట్,
    రాష్ట్ర నాయకులు వనం సుధాకర్, కె.పర్వతాలు
    వెల్లడి

నమస్తే శేరిలింగంపల్లి : బిఎల్ఎఫ్ రాష్ట్ర కమిటి పిలుపు మేరకు అక్టోబర్ 15న అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల ఎదుట  ధర్నాలు నిర్వహించాలని BLF రాష్ట్ర కమిటి నిర్ణయించింది. 29, 30 తేదీల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తిలక్ గార్డెన్ లోని న్యూ అంబేద్కర్ భవన్ జరిగిన రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతుల చివరి రోజు జరిగిన రాష్ట్ర కమిటి సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. అర్హులైన వారికి దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్, బిసి, ఎస్టీ, మైనారిటీ కార్పోరేషన్ లకు నిధుల కేటాయింపు  డిమాండ్ తో ధర్నా చేయాలని నిశ్చయించుకున్నారు. ఈ సందర్భంగా దండి వెంకట్, వనం సుధాకర్ మాట్లాడుతూ.. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాకా రాష్ట్ర జనాభా 60% బిసిలకు అత్యంత అన్యాయం జరిగిందని తెలిపారు. గత ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టిటిడి ప్రభుత్వాలు బిసి కార్పోరేషన్ కు నిరుద్యోగులకు ఉపాధి కోసం నిధులు మంజూరు చేసేవని, ఇప్పుడు కేసీఆర్ ఆ నిధులతో ఆధిపత్య దోపిడి వర్గాలకు సేవ చేస్తున్నారని విమర్శించారు. అందుకే అక్టోబర్ 15న కలెక్టర్ కార్యాలయాల ధర్నాలు అనంతరం గ్రామ స్థాయిలో పాదయాత్రలు నిర్వహించి బిసి, ఎస్టీ, మైనారిటీ ప్రజలను చైతన్య పరుస్తామని తెలిపారు. ఈ సమావేశంలో బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు కె.పర్వతాలు అద్యక్షతన జరిగిన సమావేశంలో బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు గాదగోని రవి, ఎస్.సిద్దిరాములు, చిట్టాల మధు, జిల్లా నాయకులు కె.మధు, కె.శ్రీనివాస్ లతో పాటు 27 జిల్లా ముఖ్య నాయకత్వం పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న BLF రాష్ట్ర కమిటి కన్వీనర్ దండి వెంకట్,
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here