నమస్తే శేరిలింగంపల్లి:శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారానగర్ శ్రీ తుల్జా భవాని అమ్మవారి ఆలయం అభివృద్ధికి తమవంతు కృషి తప్పకుండా ఉంటుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. తారానగర్ వాస్తవ్యులు బీకే రాఘవ రెడ్డి కుటుంబ సభ్యులు తుల్జాభవాని అమ్మవారికి స్వర్ణ కిరీటాన్ని బహుకరించారు.కార్యక్రమానికి ప్రభుత్వ విప్ గాంధీ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి స్వర్ణ కిరీటం సమర్పించిన రాఘవ రెడ్డి కుటుంబ సభ్యుల ను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శాలువాతో సత్కరించి అభినందించారు. అమ్మవారి చల్లని చూపులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. స్వర్ణ కిరీటం బహుకరించడం చాలా ధార్మిక గొప్ప విషయం అని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓ సత్య చంద్ర, తుల్జాభవాని ఆలయ కమిటీ చైర్మన్ మలికార్జున శర్మ , మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, నాయకులు పద్మారావు, వెంకటేష్, కృష్ణ యాదవ్, వేణు గోపాల్, నటరాజ్ గుప్తా సంజీవ రెడ్డి, రవీందర్ రెడ్డి, సంపత్, మహేష్, గోవింద్ చారీ, బచ్చు రాజు, చంద్రశేఖర్, జనార్దన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.