నమస్తే శేరిలింగంపల్లి:శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ లోని రైల్వే అండర్ బ్రిడ్జిలో నీరు నిల్వ ఉండకుండా రూ.20 లక్షల అంచనావ్యయం తో చేపడుతున్న మరమ్మత్తుల పనులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా ఏర్పడిన సమస్య నేటితో పరిష్కారం కానుందని అన్నారు. వర్షపు నీటితో అండర్ బ్రిడ్జి నిండిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం వాటిల్లుతుందన్నారు. లీకేజీల నివారణకు రూ. 20 లక్షల అంచనా వ్యయంతో వాటర్ ఫ్రూఫింగ్ పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. పాపిరెడ్డి కాలనీ, హుడా కాలనీ ప్రజలకు, రైల్వే ప్రయాణికులకు అనుసంధానకర్తగా అండర్ పాస్ పనిచేయనుందని చెప్పారు. అండర్ పాస్ ద్వారా ప్రయాణం కు ఇబ్బంది కలగకుండా, లీకేజీ లేకుండా ఉండేందుకు ప్రత్యేక కెమికల్, సిమెంట్ తో లీకేజీలు, గ్యాపులు పూడ్చివేయడం జరుగుతుందని చెప్పారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఆయన వెంట మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, నాయకులు పొడుగు రాంబాబు, కొండల్ రెడ్డి, పద్మారావు, లింగం శ్రీనివాస్, వేణు గోపాల్, రమణ, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.