హ‌నుమాన్ యూత్ వినాయ‌కుడి చెంత మ‌హా అన్న‌దానం – అవ‌కాశం ల‌భించ‌డం మా అదృష్టం: బాలింగ్ ల‌క్ష్మీ గౌత‌మ్ గౌడ్‌

నమస్తే శేరిలింగంపల్లి: హ‌ఫీజ్‌పేట్‌ గ్రామంలోని హనుమాన్ యూత్ అసోసియేషన్ వినాయ‌క మండ‌పం వ‌ద్ద టీఆర్ఎస్ డివిజ‌న్ అధ్య‌క్షుడు బాలింగ్ గౌత‌మ్‌గౌడ్ ల‌క్ష్మీ దంప‌తుల‌ ఆధ్వర్యంలో ఆదివారం మ‌హా అన్న‌దాన కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో మియాపూర్ ఇన్‌స్పెక్ట‌ర్ సామ‌ల‌ వెంకటేష్, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజ‌రై ప్రత్యేక పూజలు నిర్వ‌హించారు.

ప్ర‌త్యేక పూజ‌ల్లో పాల్గొన్న ఇన్స్‌పెక్ట‌ర్ సామ‌ల వెంక‌టేశ్‌, కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌, బాలింగ్ గౌత‌మ్ గౌడ్‌లు

ఈ సంద‌ర్భంగా గౌత‌మ్ గౌడ్ మాట్లాడుతూ హ‌నుమాన్ యూత్ ఆద్వర్యంలో గ‌త 9 రోజులుగా ప్ర‌తిరోజు అన్న‌దానం జ‌రిగింద‌ని, ఐతే మ‌హా అన్న‌దాన కార్య‌క్ర‌మం చేసే అవ‌కాశం త‌న‌కు ల‌భించడం అదృష్టంగా బావిస్తున్న‌ట్టు తెలిపారు. వినాయ‌కుడి చెంత‌న వేలాది మందికి అన్న‌ప్ర‌సాదాన్ని అంద‌జేయ‌డం గ‌ర్వంగా ఉంద‌ని అన్నారు. ఇందుకు స‌హ‌క‌రించిన హ‌నుమాన్ యూత్ స‌భ్యుల‌కు ఆయ‌న ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలింగ్ యాదగిరి గౌడ్, క‌న‌క‌మామిడి నరేందర్ గౌడ్, కనక మామిడి వెంకటేష్ గౌడ్, సాయి కృష్ణ గౌడ్, వెంకటేష్ ముదిరాజ్, పాండు, రాజు గౌడ్, రాధాకృష్ణ, సాజిద్, జగన్ గౌడ్, బాబు గౌడ్, దిలీప్ ముదిరాజ్, లక్ష్మణ, మల్లేష్ యాదవ్, అశిల శ్యామ్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాన్ని వడ్డిస్తున్న బాలింగ్ గౌత‌మ్ గౌడ్‌, క‌న‌క‌మామిడి న‌రెంద‌ర్ గౌడ్ తదిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here