నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి తండా, ఎన్టీఆర్ నగర్ లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి సందర్శించారు. విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. మండప నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ విఘ్నేశ్వరుని కరుణాకటాక్షాలు ప్రజలపై తప్పక ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గోపనపల్లి తండ వడ్డెర సంఘం అధ్యక్షుడు అలకుంట శ్రీరామ్, ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్, సోఫా కాలనీ సొసైటీ అధ్యక్షుడు బి. విఠల్, కార్యదర్శి నరసింహారెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగ సుబ్రహ్మణ్యం, సీనియర్ నాయకులు శ్రీనివాస్, నర్సింగ్ నాయక్ , వెంకటేష్, ప్రభాకర్, ప్రకాష్, కృష్ణ, వేణు,రమేష్, స్థానిక నేతలు, బస్తీ వాసులు, కార్యకర్తలు పాల్గొన్నారు.