నమస్తే శేరిలింగంపల్లి:ప్రకృతిని ఆరాధించే గొప్ప సంస్కృతి మనది అని, పూలను పూజించడం ప్రపంచంలో మరెక్కడా లేదని, గొప్ప వరం మన తెలంగాణ ప్రజలకే దక్కడం అదృష్టమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని గంగారాం చెరువు బతుకమ్మ కొలను వద్ద నిర్వహించిన సద్దుల బతుకమ్మ పండుగ సంబరాల్లో స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, చందానగర్ సీఐ క్యాస్ట్రో రెడ్డి తో కలిసి ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ప్రపంచంలో పూల తో దేవుడిని పూజిస్తారు కానీ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఆ పూల నే దేవత గా పూజించే ఘన చరిత్ర మన తెలంగాణ ప్రత్యేకమని పేర్కొన్నారు. అదేవిధంగా మన తెలంగాణ ఆచార, సంస్కృతి, సంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక బతుకమ్మ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, టీఆర్ఎస్ చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి , నాయకులు రవీందర్ రెడ్డి, గురు చరణ్ దుబే, గుడ్ల ధన లక్ష్మీ, దొంతి శేఖర్, మల్లేష్ గుప్తా, ఓ. వెంకటేష్, రాజేందర్, వరలక్ష్మి, భవాని చౌదరీ, పార్వతి తదితరులు పాల్గొన్నారు.