నమస్తే శేరిలింగంపల్లి: మానవ హక్కుల విభాగం తెలంగాణ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఉమెన్స్ డెవలప్మెంట్ ప్రధాన కార్యదర్శి జెల్లా బాలమణి గౌడ్ ని నియమిస్తూ నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ న్యూఢిల్లీ జాతీయ అధ్యక్షుడు నెల్లి గురుదేవ్ నియామక పత్రాన్ని అందజేశారు. నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ న్యూఢిల్లీ జాతీయ అధ్యక్షులు నెల్లి గురుదేవ్ తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా విశిష్ట సేవలను గుర్తించి పేదలు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం అహోరాత్రులు శ్రమించి విద్య, వైద్యం, అనాధ సంక్షేమం మానవ హక్కుల పరిరక్షణ కోసం చేసిన విశిష్ట కృషికి తెలంగాణ మానవహక్కుల విభాగానికి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నియమించినట్లు జెల్లా బాలమణి గౌడ్ తెలిపారు. తన నియామకానికి సహరించిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కడలి సత్యనారాయణ దక్షిణ భారత ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ కుడుపూడి శ్రీనివాసరావు, రాష్ట్ర ఓబీసీ నాయకులు సాయి బాబా గౌడ్, హ్యుమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.