నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ పరిధిలోని హుడా ఫేస్ 2 కాలనీ రోడ్ నంబర్ 6లో రూ. 50 లక్షలతో సిసిరోడ్డు పనులను కాలని వాసులు, జిహెచ్ఎంసి అధికారులతో కలిసి స్థానిక డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ప్రారంభించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని గుత్తేదారులకు అధికారులకు సుచించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం చూపుతామని డివిజన్ లో మంజూరైన అభివృధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు రాజయ్య, సత్తయ్య, విద్యాసాగర్, రమణ రెడ్డి, కిషోర్, మధుసూధన్ రావు, పకిరయ్య, గంగాధర్, సత్యనారాయణ , కృష్ణ , జిహెచ్ఎంసి అధికారులు డబ్ల్యూ ఐ రాజు పాల్గొన్నారు.