నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్న దళితులపై జరుగుతున్న దాడులను, వివక్షను వివరిస్తూ.. వారికి ఎస్సీ హోదాను కల్పిస్తూ రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడాలని కోరుతూ యునైటెడ్ ఇండియన్ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ కాంగ్రెస్ నాయకులను కోరింది.
ఈ సందర్బంగా శేరిలింగంపల్లి 106 డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ సామెల్ కార్తీక్ ఆధ్వర్యంలో యునైటెడ్ ఇండియన్ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షులు బెజవాడ రవికుమార్ ఏఐఐసిసి కార్యదర్శి అల్లంపూర్ మాజీ శాసన సభ్యులు ఎస్. ఏ సంపత్ కుమార్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. క్రైస్తవుల్లోని దళితులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ.. గతంలో వారిపై జరిగిన దాడులను వివరిస్తూ లిఖితపూర్వకంగా వినతి పత్రాన్ని అందించారు. రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు నగరి గారి ప్రీతంతో కలసి సానుకూల స్పందనను తెలిపారు. ఈ సమావేశంలో క్రైస్తవ యువ నాయకులు బర్నబాస్ యుఐసి జేఏసీ సభ్యులు డీ,ఎన్. రాజు పాల్గొన్నారు.