నమస్తే శేరిలింగంపల్లి: రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, నల్లమోతు భాస్కర్ రావు ను ప్రకటించిన శుభసందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సందర్బంగా వారిని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా శాలువాతో సత్కారించి, పుష్పగుచ్ఛం అందచేసి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాక పలు కాలనీ వాసులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్ లోని అయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి బాణా సంచా కాల్చి, స్వీట్లు పంచి పెట్టారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు.
తనపై నమ్మకం ఉంచి శేరిలింగంపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా మళ్ళీ ప్రకటించిన శుభసందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రాష్టంలో మళ్ళీ బీర్ఎస్ పార్టీ దే హైట్రిక్ విజయమన్నారు. శేరిలింగంపల్లి లో భారీ మెజారిటీతో గెలిచి గులాబీ జెండా ఎగురవేస్తామని చెప్పారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత బాధ్యతతో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ముచ్చటగా మూడో సారి భారీ మెజారిటీతో గెలిచి శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అగ్రగామి గా నిలబెట్టడానికి కృషి చేస్తానన్నారు.