కొండాపూర్ డివిజన్ పరిధిలోని సైబర్ హిల్స్ నాల విస్తరణ మరియు లుంబిని ఎనక్లేవ్ లో మంచి నీటి సమస్య పైప్ లైన్ షిఫ్టింగ్ మరియు డ్రైనేజీ సమస్యను ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ కరోనా వంటి విపతర్క పరిస్ధితుల్లో అభివృద్ధి,సంక్షేమం అగకూడదనే ఉదేశ్యం తో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని,అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడకుండా పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చేస్తున్నామని, మిగిలిపోయిన అసంపూర్తి నాలా విస్తరణ పనులలో వేగం పెంచాలని ,ప్రాజెక్ట్ మరియు GHMC అధికారులు సమన్వయం తో పని చేసి పనులలో పురోగతి సాధించాలని ,అదేవిధంగా నాలా విస్తరణ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని,నాణ్యత విషయంలో రాజీ పడకుడదని పనుల లో వేగం పెంచాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడలని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని ప్రభుత్వ విప్ గాంధీ గారు పేర్కొన్నారు.నాలా నిర్మాణ పనుల పై పలు సూచనలు,సలహాలు ఇవ్వడం జరిగినది.
అదేవిధంగా లుంబిని ఎనక్లేవ్ లో మంచి నీటి పైప్ లైన్ల షిఫ్టింగ్ విషయం పై పై వాటర్ వర్క్స్ ,ప్రాజెక్టు అధికారులు సమన్వయము తో పని చేసి సమస్యను పరిష్కరించి కాలనీ లో మంచి నీటి సమస్య ను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు తెలియచేసారు .అదేవిధంగా కాలనీ లో ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికివచ్చిన పరిష్కరిస్తానని ,ప్రజలకు ఎల్లా వేళల అందుబాటులో ఉంటానని ,కాలనీల అభివృద్ధికి,డివిజన్ మరియు నియోజకవర్గ అభివృద్ధికి శాయషెక్తుల కృషి చేస్తానని ప్రభుత్వ్ విప్ గాంధీ గారు పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో అధికారులు DE రమేష్ , AE శ్రీనివాస్ ప్రాజెక్ట్ DE భరద్వాజ్ ,AE పరమేష్ వాటర్ వర్క్స్ మేనేజర్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు