ఆల్విన్ కాలనీ: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ కాలనీడివిజన్ లో నెలకొన్న సమస్యలు, పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, కార్పొరేటర్ దొడ్లవెంకటేష్ గౌడ్ లు మునిసిపల్ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు.
సమీక్షలో భాగంగా కార్పొరేటర్ వెంకటేషగౌడ్ పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఉషా ముల్లపూడి ప్రధాన రహదారి విస్తరణ పనులు ఆలస్యం జరుగుతుందని తెలిపారు. ఎల్లమ్మ చెరువు వద్ద విస్తరణ పనులు పూర్తిచేసి రోడ్డు నిర్మాణం వేగవంతం చేయాలని కోరారు. డివిజన్ లో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు.. స్మశాన వాటిక అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ డివిజన్లో అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యం తగదన్నారు. పెండింగులో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో గోవర్ధన్, ఏఈ సుభాష్, నాయకులు మోజెస్ తదితరులు ఉన్నారు