మ‌హిళ అదృశ్యం

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఇంటి నుంచి ప‌ని నిమిత్తం బ‌య‌ట‌కు వెళ్లిన ఓ మ‌హిళ అదృశ్య‌మైన సంఘ‌ట‌న చందాన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్ర‌కారం ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. వికారాబాద్ లోని తాండూర్‌కు చెందిన ఎరుక‌ల శ్రీ‌ను గ‌త 2 ఏళ్ల కిందట బ‌తుకు దెరువు నిమిత్తం న‌గ‌రానికి వ‌ల‌స వ‌చ్చి చందాన‌గ‌ర్‌లోని శివాజీ న‌గ‌ర్‌లో నివాసం ఉంటూ స్థానికంగా కూలి ప‌నులు చేస్తూ జీవ‌నం సాగిస్తున్నాడు. ఇత‌ని భార్య ఎరుక‌ల అంకిత (20) ఉంది. కాగా అంకిత కూడా కూలి ప‌నులు చేస్తూ కుటుంబ పోష‌ణ‌లో బాధ్య‌త వ‌హిస్తోంది.

అంకిత (ఫైల్‌)

ఈ క్ర‌మంలో ఈ నెల 11వ తేదీన ఉద‌యం శ్రీ‌ను య‌థావిధిగా ప‌ని నిమిత్తం బ‌య‌ట‌కు వెళ్లాడు. త‌రువాత అత‌ని భార్య అంకిత కూడా ప‌ని నిమిత్తం బ‌య‌ట‌కు వెళ్లింది. కానీ సాయంత్రం తిరిగి రాలేదు. దీంతో బంధువులు, స్నేహితులు, తెలిసిన వారి వ‌ద్ద ఆమె ఆచూకీ కోసం శ్రీ‌ను విచారించాడు. అయినా ఆమె ఆచూకీ ల‌భించ‌లేదు. దీంతో అత‌ను పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా వారు కేసు నమోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అంకిత అదృశ్య‌మైన‌ప్పుడు గోధుమ రంగు చీర క‌ట్టుకుని ఉంద‌ని, ఆమె ఎత్తు 4 అడుగుల 5 అంగుళాల‌ని, ఆమె తెలుగులో మాట్లాడుతుంద‌ని, ఎవ‌రైనా గుర్తు ప‌డితే వెంట‌నే త‌మ‌కు స‌మాచారం అందించాల‌ని పోలీసులు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here