మాజీ మంత్రి కేటీఆర్ ఆరోప‌ణ‌లు నిరాధార‌మైన‌వి: మెడికవర్ వైద్యులు

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మెడికవర్ హాస్పిటల్స్ గురించి మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోప‌ణ‌ల్లో ఎంత మాత్రం నిజం లేద‌ని హాస్పిట‌ల్ వైద్యులు తెలిపారు. ఈ మేర‌కు వారు బుధ‌వారం విలేకరుల స‌మావేశంలో వివ‌రాల‌ను వెల్ల‌డించారు. మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌కు వారు స్పందించారు. ఈ సంద‌ర్భంగా హాస్పిట‌ల్ డాక్ట‌ర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ మెడికవర్ హాస్పిటల్స్ కి రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధం లేద‌న్నారు. మొట్టమొదటి త‌మ‌ ప్రస్థానం హైటెక్ సిటీలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ చేతుల మీదుగా మాక్స్ క్యూర్ ప్రాంభించడం జరిగింద‌న్నారు. తదనంతరం మెడికవర్ హాస్పిటల్స్ – స్వీడిష్ (యూరోపియాన్) కంపెనీ వారికీ మెజారిటీ స్టేక్ ఇవ్వడం జరిగింద‌న్నారు. 4 రాష్ట్రాలలో తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ , మహారాష్ట్ర, క‌ర్ణాటక రాష్ట్రాలలో తాము సేవలను అందిస్తున్నామ‌ని, మొత్తం త‌మ‌ 24 హాస్పిటల్స్ ఆయా సందర్భాలలో ఎవరెవరు అధికారంలో ఉన్నారో వారిచేత తాము ప్రాంభించడం జరిగింద‌న్నారు.

విలేకరుల స‌మావేశంలో మాట్లాడుతున్న మెడిక‌వ‌ర్ వైద్యులు

ఒక ప్రపంచ ప్రసిద్ధ ఆరోగ్య సంస్థగా, మెడికవర్ 13 దేశాలలో సేవలందిస్తోంది. వీటిలో జర్మనీ, స్వీడన్, పోలాండ్, టర్కీ, బెలారస్, బల్గేరియా, జార్జియా, హంగేరీ, రొమేనియా, సెర్బియా, మోల్డోవా, ఉక్రెయిన్, భారతదేశం ఉన్నాయి. భారతదేశంలో మెడికవర్ హాస్పిటల్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో ప్రధాన సేవలతో అందుబాటులో, ప్రతి సంవత్సరం కోట్లాది మంది రోగులకు వైద్య సేవలను అందిస్తోంది. మేం ఉన్నతమైన వైద్య సేవలు అందించే దిశగా కృషి చేస్తూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సహాయం అందించడంలో ప్రత్యేకతను కలిగి ఉన్నాము. ప్రజల ఆరోగ్యం కోసం మేం సదా కృషి చేస్తూ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందుకు వెళ్తున్నాము, కానీ ఎలాంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేదు.

మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, రామోహన్ నాయుడు, శరద్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ వంటి ప్రముఖులు, ఆధ్యాత్మిక వేత్త శ్రీ చినజీయర్ స్వామి వంటి గొప్ప వ్యక్తులచే ఆసుపత్రులు ప్రారంభించబడడం మాకు గౌరవప్రదం. వీరితో నిర్వహించిన ఈ కార్యక్రమాలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడానికి ఎల్లా వేళలా ముందుంటాం అని అన్నారు. మేము స్పష్టంగా తెలియజేయదలిచినది ఏమిటంటే, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అన్నం శరత్ రెడ్డి మాక్స్‌బీన్ ఫార్మాలో డైరెక్టర్ కాదని తెలియ‌జేస్తున్నాం. దయచేసి దీన్ని గమనించగలరు. మెడికవర్ హాస్పిటల్స్ గురించి చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి అని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అన్నం శరత్ రెడ్డి, డైరెక్టర్ హరికృష్ణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here