శేరిలింగంపల్లి, ఏప్రిల్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): అనుమానస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్‌లోని నైట్ ఐ లాడ్జ్‌లో ఓ మహిళ మృతదేహం ఉందన్న సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్‌కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన మహిళను పటాన్‌చెరులోని ఇంద్రేశం గ్రామానికి చెందిన నరసమ్మ (39)గా పోలీసులు గుర్తించారు. ఆమె మృతి చెందడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని, అన్ని కోణాల్లోనూ కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.






