శేరిలింగంపల్లి, జూలై 2 (నమస్తే శేరిలింగంపల్లి): భర్తతో గొడవపడి తీవ్ర మనస్థాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన అరుణ శివాజీ పాటిల్ (30), నీలేష్ పాటిల్‌లకు 2023 మార్చిలో వివాహం అయింది. వీరు బ్రతుకు దెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి శేరిలింగంపల్లిలోని నల్లగండ్ల అపర్ణ సైబర్ కమ్యూన్‌లో గత జూన్ 1వ తేదీ నుంచి నివాసం ఉంటున్నారు. కాగా ఇటీవల భార్యాభర్త ఇద్దరికీ గొడవలు తీవ్రంగా అవడం మొదలైంది. ఈ క్రమంలోనే వారు జూలై 1వ తేదీన తిరిగి గొడవ పడ్డారు. దీంతో భర్త నీలేష్ పాటిల్ ఇంట్లో లేని సమయంలో అరుణ సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అరుణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.