సుంద‌రీక‌ర‌ణ ప‌నుల‌తో చెరువుల‌కు మ‌హ‌ర్ద‌శ‌: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, జూలై 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియపూర్ డివిజన్ పరిధిలోని లక్ష్మీ నగర్ కాలనీలో ఉన్న‌ నాయనమ్మ కుంట చెరువు సుందరికరణలో భాగంగా Nexus select Malls కంపెనీ, IGUS, HDFC బ్యాంక్ ల CSR ఫండ్స్ ద్వారా మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చేపట్టనున్న చెరువుల పునర్జీవనంలో భాగంగా సుందరీకరణ, పునరుద్ధరణ పనులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, ఇరిగేషన్ అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 64 చెరువులను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. చెరువుల సుందరీకరణతో స్వచ్చమైన వర్షపు జల సిరులను ఒడిసిపడుదామని కోరారు. చెరువుల జలకళతో గ్రామీణ వాతావరణం నెలకొల్పడమే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు DE నళిని , AE పావని, ఐటీ సంస్థ ప్రతినిధులు రామ్ బొట్ట, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here