నమస్తే శేరిలింగంపల్లి: ఇంట్లో తండ్రి మందలించాడని ఓ యువతి ఇంటి నుంచి వెళ్లిపోయి అదృశ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ కు చెందిన ఆకార్ దేవికారాణి, రాజేష్ కుటుంబ సభ్యులతో శేరిలింగంపల్లి పాపిరెడ్డి కాలనీలో గత 6 నెలలుగా నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె ఆకార్ ఉజ్జయినీ (18) డిగ్రీ చదువుతోంది. తండ్రి రాజేష్ మందలించాడని ఉజ్జయినీ ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఈ నెల 6 వ తేదీన తనకు చెందిన కొన్ని బట్టలు తీసుకొని మమ్మీ నేను బ్రతకడానికి వెళ్తున్నాను..నన్ను వెతక కూడదు..అని ఒక డైరీలో రాసి పెట్టి ఇంటి నుండి వెళ్ళిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు చందానగర్ పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు చందానగర్ పిఎస్ కు 040- 27853911, 9490617118, 7901110877 గాని, 100 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.