శేరిలింగంపల్లి, డిసెంబర్ 31 (నమస్తే శేరిలింగంపల్లి): గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో భవన నిర్మాణ అనుమతుల సమస్యలపై జిహెచ్ఎంసి సిసిపి శ్రీనివాస్ ని కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉప్పలపాటి శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో భవన నిర్మాణ అనుమతులలో జ్యాప్యం జరుగుతున్నదని ఈ సమస్యను పరిగణనలోకి తీసుకుని భవన నిర్మాణ అనుమతులను త్వరగా ఇవ్వాలని వినతి పత్రం లో కోరినట్లు తెలిపారు. వినతి పత్రాన్ని సీసీపీ శ్రీనివాస్ పరిశీలించి భవన నిర్మాణ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారని ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ తెలియజేశారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2024/12/31a-1024x478.jpeg)