శేరిలింగంపల్లి, నవంబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): ఇంటర్మీడియట్ కళాశాలలో విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న కీచక లెక్చరర్‌పై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు వారు బాధితుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదును స్వీకరించారు. పోలీసులు తెలిపిన ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మదీనాగూడలోని శ్రీచైతన్య కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్‌గా పనిచేస్తున్న కందుకూరి హరీష్ గత కొంత కాలంగా తమను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని విద్యార్థినులు తెలిపారు. తమతో సోషల్ మీడియా ఖాతాల ద్వారా అసభ్యంగా చాటింగ్ చేస్తున్నాడని, క్లాస్ రూమ్‌లోనూ అసభ్యంగా తాకుతున్నాడని, అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నాడని వారు వాపోయారు. దీంతో ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.